Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పూత నిలిచి కాయపడేనా?
అ మండలంలో 1445 ఎకరాల్లో మామిడి సాగు
నవతెలంగాణ-గార్ల
ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి తోటలలో పూసిన పూతలు అన్నదాతలలో ఆశలు రేకేత్తిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల కాలంలో మామిడి పూతలు అంతంత మాత్రంగానే పూసి మామిడి రైతులకు అశించినస్థాయిలో దిగుబడులు లేక నిరాశకు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభ దశలో మామిడి పూతలపై రైతులు కొంత అందోళన చెందినప్పటికి పిందె పడే దశలో మామిడి పూత భారీగా పూసింది. పడటంతో రైతుల ఆశలు చిగురిస్తున్నాయని చెప్పొచ్చు.
మండల పరిధిలోని సీతంపేట, ముల్కనూరు, పినిరెడ్డిగూడెం, మద్దివంచ, పోచారం, పుల్లూరు, బుద్దారం,గార్ల గ్రామాల్లో ఎక్కువగా మామిడి తోటలు ఉన్నాయి. వీటితో పాటు మండలంలో ఉన్న వివిధ గ్రామాల్లో ని మామిడి తోటలతో కలిపి 325 మంది రైతులు 1445 ఎకరాలలో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. సీతంపేట గ్రామానికి చెందిన మామిడి రైతు గడ్డిపాటి రాజారావు అనే రైతు పండిస్తున్న మామిడి కాయలు గుజరాత్, ఢిల్లీ, ముంబాయి రాష్ట్రాలతో పాటు రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ మార్కెట్లకు తరలిస్తూ అమ్మకాలు సాగిస్తుండటంతో సీతంపేట గ్రామం మామిడి పండ్లకు ప్రసిద్ది గాంచింది. నవంబర్, డిసెంబర్ నెలల కల్లా మామిడి తోటలు పూలతో కళకళలాడాలి.డిసెంబర్ చివరి నాటి నుండి జనవరి నెల వరకు పూత మొత్తం పిందెలగా మారడం జరుగుతుంది.ఈ క్రమంలో ఇన్ని రోజులు ఇరగ పూసిన మామిడి పూతలను చూసి అన్నదాతలలో అనందాలు వెల్లువిరుస్తన్నాయి. ప్రస్తుతం మామిడి తోటలకు నల్ల నల్లి, తామర నల్లి సొకడంతో పూత నల్లగా మారుతుండటంతో రైతులలో గుబులు మొదలైంది. ఈ వైరస్ కారణంగా మామిడి తోటల్లో పూత పిందె లేకుండా పోతుందని రైతులు అందోళన చెందుతు న్నారు. పడిన పూత మొత్తం నల్ల నల్లతో పింద పడకుండానే పూత రాలిపోతుండటంతో రైతులు ఆశలు వదులుకునే పరిస్దీతులు దాపురించాయి. ఈ క్రమంలో మూడు వారాల నుండి మళ్లీ మామిడి తోటలకు పూత వస్తుం డటంతో ఎక్కడ చూసిన మామిడి తోటలు కలకళలాడుతున్నాయి. అశలు వదులుకున్న మామిడి రైతులు మళ్లీ పూత నిలిచేందుకు పెద్ద ఎత్తున మందులు పిచికారి చేస్తున్నారు. సగం పూత నిలిచినా తమకు కొంత లాభం చేకూరుతుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .తక్షణమే ఉద్యాన వన అధికా రులు మామిడి తోటలను క్షేత్ర స్దాయిలో పరిశీ లించి తగిన సూచనలు ఇవ్యాలని మామిడి తోట సాగుదారులకు సదస్సులు నిర్వహించా లని రైతులు కోరుతున్నారు.
అధికారులు సదస్సు నిర్వహించాలి
మండల పరిధిలోని మామిడి తోట సాగు చేస్తున్న రైతులను సమికరించి మామిడి పూత నిలవడానికి తగిన సలహలు, సూచనలు ఇవ్యాలి.ఇప్పటికే పలు సార్లు మందులు పిచికారి చేసిన పూత నిలవడం లేదు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలి.
-గడ్డిపాటి రాజారావు, రైతు సంఘం జిల్లా నాయకులు, రైతు