Authorization
Tue March 11, 2025 02:14:26 am
అ కొన్ని పంచాయతీలకు
పాఠశాలలే దిక్కు
అ తండా పంచాయతీలకు
సొంత భవనాలు కరువు
నవతెలంగాణ-జఫర్గడ్
తండాలు కొత్త జీపీలుగా మారడంతో అన్ని వసతులు సమకూరుతాయనుకుంటే నిరాశే ఎదురవుతోంది. ఏండ్లు గడుస్తున్నా పట్టించు కునే నాధుడే లేడు. కనీసం భవనాలు కూడా మంజూరు చేయలేని దుస్థితి నెలకొంది. దీంతో పాలకవర్గంతోపాటు ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ఇందుకు జఫర్ఘడ్ మండలే నిదర్శనం. మండలంలోని అల్వార్బండ తండా, దుర్గా తండా, లక్ష్మీనాయక్ తండ, ముగుదుం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాట య్యయి. మూడేండ్లు గడిచినా చాలాచోట్ల పంచాయ తీలకు సొంత భవనాలు నిర్మించ లేదు. నేటికీ అద్దె భవనాలే దిక్కవుతున్నాయి. కొన్ని చోట్ల పాఠశాలల భవనాలను, మరికొన్ని చోట్ల అద్దె ఇండ్లల్లో కొనసాగిస్తున్నారు. మండ లంలో నాలుగు నూతన గ్రామపంచాయతీల పరిస్థితి ఇలానే ఉంది. నిధులు కేటాయించక పోవడంతో సమస్య పరిష్కారం కావట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంచాయతీలకు ఇస్తున్న నిధులు నిర్వహణకే సరిపోవడం లేదని పలువురు సర్పంచులు వాపోతున్నారు. సొంత భవనాలు నిర్మించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు.