Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని కాపురం ఓసీపీ బ్లాక్-1లో ఇండ్లు కోల్పోయిన భూ నిర్వాసితులు శుక్రవారం ఓసీపీ గెట్-1 వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ అధికారులు ప్రచురించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం రెండు జాబితాల్లో తమ పేర్లు వచ్చి చివరి జాబితాలో పేర్లు గల్లంత వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిహేను సంవత్సరాలుగా కాపురంలో తాము నివాసం ఉంటున్నామని, ఇండ్లు గని ఉపరితలంలో కోల్పోవడంతో తాడిచెర్లకు వెళ్లినట్లు వాపోయారు. తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించేంతవరకు తమ ఆందోళన కొనసాగిస్తాని బైఠాయించారు. దీంతో సంఘటన స్థలానికి తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సరితా,కొయ్యుర్ ఎస్ఐ సత్యనారాయణ చేరుకొని నిర్వాసితులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు రాగం ఐలయ్య, సత్తయ్య, మల్లేష్, రవి, లింగారావు తదితరులు పాల్గొన్నారు.