Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపురం
మండల కేంద్రంలో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటించింది. గ్రామ పంచాయతీ ఆధీనంలో పనిచేస్తున్న పాఠ శాలలు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించింది. ఉపాధిహామీ ద్వారా చేపట్టిన మరుగుదొడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలను, కొనసాగుతున్న పనులను, పారిశుధ్యం పనులను పరిశీలిం చింది. అంతకుముందు స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే అధికారుల బృందా నికి సర్పంచ్ శ్రీపతిబాపు పుష్ప గుచ్ఛాలు అందజేసి గ్రామంలోకి ఘనంగా స్వాగతించారు. అనంతరం అధికారులను సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి రాణి బాయి,ఎంపీడీఓ శంకర్ నాయక్, ఉపసర్పంచ్ సల్మాన్‌ఖాన్, గ్రామ కార్యదర్శి రజనీకాంత్‌రెడ్డి, వార్డు సభ్యులు మెచినేని రవిచందర్, ఉస్మాన్ ఖాన్, ఎంపీడీఓ శంకర్‌నాయక్, ఏఈ రాజేందర్‌రెడ్డి, నాయకులు రెబ్బ ప్రతీప్ పాల్గొన్నారు.