Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన కట్కూరి రాజిరెడ్డికి మంజూరైన రూ.45,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శుక్రవారం టీఆర్ఎస మండల శాఖ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారావు అందజేశారు. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి. ఆదేశాలమేరకు బాధితుని ఇంటి వద్దకి వెళ్లి చెక్కు పంపిణి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పులిగిల్ల సమ్మయ్య, ఉపసర్పంచ్ సాధం కనకయ్య, నాయకులు గొట్టేముక్కుల సారయ్య, బొగ్గుల శంకరయ్య, బక్కతట్ల సమ్మయ్య, బండారి నరేష్, నేరెళ్ల వీరాస్వామి, తదితరులు పాల్గొన్నారు.