Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా అభివృద్ధిలో గెజిటెడ్ అధికారులు ముఖ్య పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గెజిటెడ్ అధికారుల డైరీని జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందించడంలో గెజిటెడ్ అధికారుల పాత్ర ప్రముఖంగా ఉంటుందని అన్నారు. గెజిటెడ్ అధికారుల సంఘం భవనం నిర్మాణానికి జిల్లా కేంద్రంలో 10 గుంటల స్థలాన్ని అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు కే.సామ్యూల్, ఉపాధ్యక్షులు ఆర్.సుదర్శన్, ఎస్ జగన్ మోహన్ రెడ్డి, కార్యదర్శి ఆంజనేయులు, జాయింట్ సెక్రెటరీ ఉమెన్ సునీత, పబ్లిసిటీ సెక్రటరీ రవికుమార్, ఎంపీడీవో అనిల్‌కుమార్ పాల్గొన్నారు.