Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జనగామ సీఐని సస్పెండ్ చేయాలి : జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-లింగాలఘనపురం
సీపీఐ(ఎం) నాయకులపై పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనుకరెడ్డి ఆరోపించారు. శుక్రవారం సీఎం కేసీర్ జనగామ జిల్లా పర్యటనలో భాగంగా శాంతిభద్రతల దష్ట్యా బీజేపీ, కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్, సీపీఐ(ఎం) నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి లింగాలఘనపురం పోలిస్‌స్టేషన్‌కు తరలించారు.అన్ని పార్టీల నాయకులను సీఎం కార్యక్రమం ముగింపు కాగానే విడుదల చేశారు. కానీ, ఒక్క సీపీఐ(ఎం) నాయకులను రాత్రి వరకు వదిలిపెటలేదు. దీంతో పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలిస్టేషన్ ఎదుట పోలిస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మోకు కనకారెడ్డి మాట్లాడుతూ... అధికార పార్టీకి తొంతుగా వ్యవహరిస్తున్న జనగామ సీఐ బాలజీ వరప్రసాద్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళ నాయకురాలును రాత్రి వరకు పోలిస్స్టేషన్లో నిర్బంధం చేయడం దురుమార్గమైన చర్య అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమా పోలీసుల రాజ్యమా అని ప్రశ్నించారు. జనగామ జిల్లాలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సీఎంను కలిసేందుకు వెళ్లగా జనగామలో అరెస్ట్ చేసి లింగాలఘనపురం పోలీసు స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కార్పొరేటర్ కంపెనీలకు అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు తగిన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా జనగామ జిల్లా మెడికల్ కాలేజ్‌తోపాటు మిగతా డిమాండ్లను నెరవేర్చకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టైన వారిలో జిల్లా కమిటీ సభ్యులు చిన్న శ్రీనివాస్ గోపి, అహల్య, రమేష్ మండల కార్యదర్శి కరుణాకర్, దేవదానం ఉన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బొట్ల చిన్న శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి ,ఐద్వా మహిళ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఇర్ర ఆహల్య, మండల కార్యదర్శి కరుణాకర్, మండల నాయకులు దేవాదానం, సమ్మయ్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.