Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ మల్హర్రావు
నవతెలంగాణ-మల్హర్రావు
తెలంగాణ ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువ వెంటనే తగ్గించాలని ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. తెలంగాణలో సామాన్యుడు భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే బెంబేలెత్తుతున్నారన్నారని ఆరోపిం చారు. సీఎం కేసీఆర్ మార్కెట్ విలువ విపరీతంగా పెంచి ప్రజల నడ్డివిరు స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా తమ భూమి వారికి తెలియకుండా పట్టా మార్పిడి చేసుకున్నవారిపై సివిల్ కోర్టులో కేసు వేయాలన్నారు. మార్కెట్ విలువ పెంచడం వల్ల సామాన్య ప్రజలకు న్యాయస్థానంలో కేసు వేయకుండా ఉందని ఆరోపించారు. మార్కెట్ విలువ ఆరు నెలల్లో రెండుసార్లు పెంచడం ద్వారా రియల్ ఎస్టేట్ మనుగడ కష్టతరంగా మారిందన్నారు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే మార్కెట్ విలువ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొండయ్య, వొన్న తిరుపతి రావు, బొబ్బిలి రాజు గౌడ్, పుప్పాల రాజు పాల్గొన్నారు.