Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్
నవతెలంగాణ-జనగామ
జిల్లా సంక్షేమ అభివృద్ధి పథకాల్లో పురోగతిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ అదేశించారు. శుక్రవారం జనగామ జిల్లాలో నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధ్యక్షతన అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతిపై సమీక్షించారు. రోడ్ల వెంబడి నాటుతున్న మొక్కల వివరాలను డీఆర్డీఓ ను అడిగితెలుసుకున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ వేగవంతంగా పూర్తి చేయాల న్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను విరివిగా చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులను పెంచాలన్నారు. రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి వారానికి ప్రతి మండలంలోని ఒక గ్రామ భూ సమస్యలు తెలుసుకుని పరిష్కరిం చాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి వేగవంతం చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పారిశుధ్యం గార్డెన్ నిర్వహణ సెక్యూరిటీ, తదితరవి సమీకృత కార్యాలయ భవనానికి అత్యంత అవసరమని వివరించారు. కాగా ఆయా శాఖల వారీగా అవసరాలను బట్టి కలెక్టర్ కార్యాలయ గదులను కేటాయించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సూచించారు. అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్‌రావు, అబ్దుల్ హామీద్, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీఏ పీడీ రామ్‌రెడ్డి పాల్గొన్నారు.