Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఎం కేసీఆర్
అ నూతన సమీకృత కలెక్టరేట్, పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-జనగామ
రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, జనగామ జిల్లాను సమగ్రాభివృద్ధి చేసుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లాలో రూ.58.20కోట్లతో నిర్మించిన నూతన సమీకత జిల్లా కార్యాలయాల భవన సముదాయంతోపాటు యశ్వంతపూర్ గ్రామ సమీపంలోని హనుమకొండ రోడ్డులో నిర్మించిన టీిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సమీకృత జిల్లా కార్యాలయాల నిర్మాణానికి కృషి చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రోడ్లు భవనాలశాఖ ఇంజినీరులు, ప్రజాప్రతినిధులను సత్కరించారు. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరువు కాటకాలున్న జనగామ జిల్లాకు ఇప్పటికే సాగు, తాగునీరు అందిం చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి మారుమూల గ్రామ అబివృద్ధికి చర్యలు తీసుకోవా లన్నారు. రాష్ట్రంలో జిల్లాలో జనగామ నెంబర్ వన్‌గా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకొని నీరు తెచుకున్నామన్నారు. 7 ఏండ్ల కిందట జన గామ భూముల విలువ ఏమి ఉండేది కాదని, నేడు రూ.4 కోట్లు ఉందన్నారు. ప్రభుత్వం ఏ పధకం తెచ్చిన అధికారులు విజయవంతం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ జీతాల కంటే, తెలంగాణ లో ఎక్కువ వస్తాయని అప్పుడే చెప్పా నన్నారు. బచ్చన్నపేటలో కరువు పరిస్థితులు చూసి ఏడ్చి నట్లు, ఇప్పుడు వరంగల్, జనగామ జిల్లాలకు ఇక కరువు అనేది రాదన్నారు. విద్యుత్ అధికారులు 24 గంటలు కష్ట పడి మనకు పవర్ ఇస్తున్నారన్నారు. కలెక్టర్ ఆఫీసులో ఏ ఆఫీస్ లేదన్నారు. అధికారులు పడిన కృషితో గ్రామాలకు 10 అవార్డులు వస్తే, అందులో తెలంగాణవే 7 గ్రామాలు ఉ న్నాయన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని సీఎం అన్నారు. 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లా కంటే, భూపాలపల్లి విస్తీర్ణంలో పెద్దదని జిల్లా చేశామన్నారు. ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లో రూ.25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారని, అభివృద్ధిని చూసి ఎక్కడి నుండో వచ్చి కొం టున్నారని అన్నారు. వ్యవసాయాన్ని స్థిరీకరించాలని అన్నారు. ఒక రైతు చనిపోతే 8 రోజుల్లో 5లక్షల బీమా అకౌంట్లో జమ అవుతుందని తెలిపారు. 6 నెలల్లో 2100 రైతు వేదికల నిర్మాణం పూర్తిచేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు. జనగామ జిల్లా సెంటర్ పాయింట్ అని, హైదరాబాద్ తో పాటు ఇంకో 32 జిల్లా లు అభివృద్ధి కేంద్రాలవుతాయన్నారు. ఉద్యోగుల సర్వీస్ బుక్ వివరాలు సరళంగా ఉండాలన్నారు. జనగామ బంగారు జనగామగా తయారవ్వాలన్నారు.
సీఎం కేసీఆర్ కృషితో జిల్లా అభివృద్ధి
: మంత్రులు, ఎమ్మెల్యేలు
సీఎం కేసీఆర్ కృషితోనే జనగామ జిల్లా మరింత అభి వృద్దికి నోచుకుంటుందని మంత్రులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అద్యక్షతన ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మహాసభలో సీఎం కేసీఆర్ ప్రసం గించిన అనంతరం వారు పాల్గొని మాట్లాడారు. జనగామ జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతో అన్ని రంగాల్లో అభివృద్ధిచెందుతోందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఎదుగుతుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం చూసి ఓర్వలేక పోతోందన్నారు. ప్రజలు బీజేపికి తగిన బుద్ధి చెబుతారన్నారు. జిల్లా అభివృద్ధికి మరింత కృషి అవసరం ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి నిధులు కేటాయిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. దేవాదుల కాల్వలను అభివృద్ధి చేసి సాగునీరందిస్తున్న ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. నాడు కాంగ్రెస్ పాలకులు చేపట్టిన దేవాదుల కాల్వల డిజైన్‌ను రీ డీజైన్ చేసి రైతులకు సరిపడా సాగు నీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నడు లేనివిదంగా జనగామ ప్రాంతంలో పంటలు పండా యన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గంలోని పలు ప్రాజేక్టుల ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందు తుందని తెలిపారు. రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, చీఫ్‌విప్ వినరుభాస్కర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమ ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, జెడ్పి చైర్మెన్లు పాగాల సంపత్ రెడ్డి, డాక్టర్్ సుధీర్ కుమార్, గండ్ర జ్యోతి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, 3వ వార్డ్ కౌన్సిలర్ పగిడిపాటి సుధ, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి కేఎస్. శ్రీనివాస రాజు, ఇఎన్సీఐ గణపతి రెడ్డి, వరంగల్ సీపీ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్ రావు, అబ్దుల్ హామీద్, తదితరులు పాల్గొన్నారు.
ట్రై మోటార్ సైకిల్స్‌ను సీఎం కేసీఆర్ పంపిణీ
జనగామ జిల్లా పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ జనగామ జిల్లా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం 105 మంది వికలాంగులకు రూ.కోటి5లక్షల విలువైన 105 ట్రై మోటార్ సైకిల్స్‌ను పంపిణీ చేశారు. పాలకుర్తి నియోజకవర్గం లోని వికలాంగులకు ట్రై మోటార్ సైకిల్స్ సమకూర్చినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును అభినందించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వివిధ సంక్షేమ, అభివద్ధి సామాజిక కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమైన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా మొదలైన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో వికలాంగులకు ట్రై స్కూటీస్ అందజేస్తున్నామని తెలిపారు.