Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జిల్లా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్క వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన సీపీఐ(ఎం) జిల్లా నాయకులను అరెస్టు చేసి పోలిష్ స్టేషన్కు తరలించడం అప్రజాస్వామ్యకమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 29 ప్రధాన సమస్యల పరిష్కారం కోసం వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, లేదంటే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నాఉ. అరెస్ట్ అయిన వారిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బిట్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, బోట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, లింగాలఘణపురం మండల కార్యదర్శి బొడ్డు కర్ణాకర్, గిరిజన సంఘం నాయకులు అజ్మీరా సురేష్ తదితరులు ఉన్నారు.