Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్లు రిషికేష్‌సింగ్, మోహన్‌కృష్ణ
కీర్తన క్లీనిక్ ఆధ్వర్యంలో
ఉచిత వైద్యశిబిరం
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
పేదలకు సేవాభావంతో వైద్యం అందించడమే తమ లక్ష్యమని కీర్తన పాలీ క్లినిక్ వైద్యులు డాక్టర్ రిషికేష్‌సింగ్, డాక్టర్ మోహన ్కృష్ణ తెలిపారు. హన్మకొండ కుమార్‌పల్లిలోని బుద్ధభవన్ లైన్‌లోని ఆస్పత్రిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిబండల్, కుమార్‌పల్లి, రెడ్డీ కాలనీ, కొత్తూరుజెండా, దాసరివాడ, మార్కెట్ఏరియా, తదితర ప్రాంతాకు చెందిన సుమారు 100 మందికి ఉచితంగా బీపీ, షుగర్, ఇతర పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే మందులు ఉచింతంగా అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్య శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. బీపీ, షుగర్, థైరాయిడ్, అస్తమా, టీబీ, గుండెజబ్బులు తదితరాలకు సంబంధించి ప్రతీ ఆదివారం ఈ శిబిరాన్ని నిర్వహి స్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.