Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి మడిపడిగ చంద్రశేఖర్ పిలుపు నిచ్చారు. ఆదివారం మాణిక్యపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన బహుజన రాజ్యాధికార యాత్ర వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శాడ కుమార్, గ్రామ కన్వీనర్ రాజు, కో-కన్వీనర్ సురేష్, నాయకులు మహేష్, కరుణాకర్, హరీష్, నిఖిల్, సతీష్ పాల్గొన్నారు.