Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
క్రీడలతో విద్యార్థులకు క్రమశిక్షణనతో పాటు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్ క్రాంతి కతమూర్తి అన్నారు. ఆదివారం మండల కేంద్రం శివారులోని గురుకుల ఆశ్రమంలో వివిధ గురుకులల నుంచి వచ్చిన విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడకారులను ఎంపిక చేసి స్పోర్స్ అకాడమీకి పంపించి శిక్షణ ఇప్పించడనున్నట్టు పేర్కొన్కారు. ఈ కార్యక్రమంలో పీటీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.