Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
అపరిచిత వ్యక్తులు మాదకద్రవ్యాలను ఆటోలలో రవాణా చేస్తే తమకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావు ఆటో డ్రైవర్లకు సూచించారు. స్థానిక బస్ స్టాండ్ కూడలిలో మాదకద్రవ్యాల నివారణపై ఆదివారం ఆటోడ్రైవర్లకు ఆయన ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి, గుడంబా, గుట్కా, గ్యాంబ్లింగ్ (4జీ) నిర్వహిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక నిఘా చేపడుతున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, గ్రామాలలోని ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆటోలకు మాదకద్రవ్యాల నివారణపై ముద్రించిన స్టిక్కర్లను అతికించారు. ఈ సదస్సులో ఆటోడ్రైవర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.