Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్
అగ్రంపహాడ్ మినీ మేడారం సమ్మక్క, సారక్క జాతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వనదేవతలను దర్శించుకొని సమీక్ష సమావేశంలో మాట్లాడారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఇంకా పూర్తి కాని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. వైద్య సౌకర్యాలు, మంచినీటి సదుపాయం, విద్యుత్, స్నానపు గదులు భక్తులకు నిరంతరం కొరత లేకుండా అందుబాటులో ఉండాలని సూచించారు. క్యూలైన్లు, వసతి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాలు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కరోనా నిబంధనలు పాటించేలా భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీవో వాసుచంద్ర, తహశీల్దార్లు సురేష్ కుమార్, రియాజ్, ఈఓ గొల్లపెల్లి శేషగిరి, సీఐ గణేష్ కుమార్, ఎంపీపీ సుమలత, సర్పంచ్ అన్నపూర్ణ, రాజు, లేతాకుల సంజీవరెడ్డి, చైర్మన్ గుండెబోయిన రాజన్న, జెడ్పీటీసీ రాధిక, అధికారులు తదితరులు పాల్గొన్నారు.