Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మహిళలు అత్యవసర పరిస్థితుల్లో మహిళా హెల్ప్ లైన్ను సంప్రదించాలని సఖీ కేస్ వర్కర్ సుధ అన్నారు. మండలంలోని ఏనుగల్, అన్నారం షరీఫ్ గ్రామాలలో మదర్ థెరిస్సా వివో, శ్రీ గణపతి వివోల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు. సఖి కేంద్రం లో బాధిత మహిళలకు అందించిన సేవల గురించి వివరించారు. వరకట్నం వేధింపులు, గహ హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, మహిళల అక్రమ రవాణా తదితర బాధితులకు రక్షణ, భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సఖి కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. బాధిత మహిళలు ఏ సమయంలోనైనా సఖి కేంద్రానికి రావచ్చని, అత్యవసర పరిస్థితులలో మహిళా హెల్ప్ లైన్ 181, 1098, 100, 08718-295014లకు ఫోన్ చేయాలని సూచించారు. తద్వారా సత్వరమే సాయం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో సఖి సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, వివో లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.