Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి
నవతెలంగాణ-జనగామ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజులపాటు సంబరంగా జరుపుకుందామని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా 15వ జిల్లా పరిధిలోని ఆస్పత్రులు వద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల తదితర ప్రదేశాల్లో అన్నదానం, పండ్ల పంపిణీ, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 16న జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాల ఏర్పాటు చేయాలన్నారు.. 17న జిల్లా వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలకు జిల్లా ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు, యువకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ చ్కెర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు పోకుల శివ కుమార్, జనగామ ఎంపీపీ కళింగరాజు, రఘునాథ్ పల్లి మండలాధ్యక్షులు వారాల రమేష్, స్టేషన్ ఘణపూర్ ఎంపీటీసీ గన్ను నర్సింహులు, చిల్పుర్ మండల రైతు కో-ఆర్డినేటర్ జనగాం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.