Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
రాజ్యంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్పై చర్య తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పో రేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, కత్తుల కవిత, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్ యాదవ్, హన్మకొండ మండలం ఎస్సీ డిపార్టుమెంటు మండల అధ్యక్షురాలు తాళ్ళపల్లి మేరీ, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శులు భాగ్య లక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.