Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వర్ధన్నపేట
ప్రమాదవశాత్తూ విద్యుద్ఘాతంతో మృతిచెందిన బొంత సంతోష్ కుటుంబానికి ఆదివారం విద్యుత్ శాఖ ద్వారా మంజురైన రూ.లు ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పూజారి సుజాత రఘు, పద్మా దేవేందర్, పట్టణాధ్యక్షుడు పులి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు నక్క రవి, వడ్డెర సంఘము నాయకులు ముత్యాలు, ఎల్లా స్వామి , విద్యుత్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.