Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూర్
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సొంత పనులపై ఉన్న శ్రద్ధ జాతర అభివృద్ధి పనులపై లేదని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి.విమర్శించారు. ఆదివారం అగ్రంపహాడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర సమయం రెండు రోజులే ఉన్న అభివద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని మండిపడ్డారు. నీటి వసతులు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు పంచాయతీరాజ్ శాఖ నిధులతో పనులు ఎక్కడ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే బంధువులు, అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లు కావడంతో ప్రభుత్వ అధికారులు వారికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఈఓ ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీటీసీని పిలవడం సరికాదన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, వచ్చే జాతరలో భక్తులకు శాశ్వతమైన అభివద్ధి పనులు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కమలాపురం రమేష్, సర్పంచ్లు కంచ రవి, పర్వతగిరి రాజు, ఎంపీటీసీ పోగుల ఇందిరా రాజిరెడ్డి, భీరం రజినీకర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ ఏరుగొండ రవీందర్, ముద్దం సాంబయ్య, శీలం నరేష్ తదితరులు పాల్గొన్నారు.