Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నవతెలంగాణ-కాశిబుగ్గ
మేడారంలో సమ్మక్క, సారలమ్మ తల్లుల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మేడారం భక్తుల కోసం వరంగల్ పండ్ల మార్కెట్లో ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్ సెంటర్ను ఆదివారం ఎమ్మెల్యే నరేందర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నుంచి మేడారం వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు 5సెంటర్లు ద్వారా 360 బస్సులను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతర నిర్వహణకు సీఎం కేసీఆర్ భారీగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, సోమిశెట్టి ప్రవీణ్, చింతాకుల అనిల్, మాజీ కార్పొరేటర్ జారతి అరుణ రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేష్ బాబు ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.