Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పెరమండ్ల బిక్షపతి, మంద చంద్రమోహన్, మాదాసి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో వారు నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి దళిత బంధు పథకానికి టీిఆర్ఎస్ కార్యకర్తలకే కేటాయించడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి దళిత జాతి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ బీరం రజనీకర రెడ్డి, బరుపట్ల కిరిటీ, ఎలగొండ ప్రవీణ్, జంపయ్య, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు