Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చెన్నారావుపేట
మండలంలో అడ్డు అదుపు లేకుండా బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపులను నియంత్రించకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ల సాధన పైనే దృష్టి పెట్టారు. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో వందలాది బెల్ట్ షాపులు వెలిశాయి. మండల పరిధిలో అమ్మకాలు పెరుగుతు ండడంతో వారు మద్యం దుకాణాదారులు సిండికేట్గా మారి బెల్టు షాపులకు స్టిక్కర్ వేసి మరి క్వాటర్కు 10-40 రూపాయల అధిక ధరలు అమ్ముకుంటున్నట్టు సమాచారం. బెల్టుషాపులను మద్యం దుకాణాదారులు ప్రోత్సహిస్తూన్నారని మండల ప్రజలు వాపోతున్నారు. అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు దుకాణాదారులతో కుమ్మక్కై చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలు, మందు ప్రియులు ఎంత మొరపెట్టుకున్నా అధికారులు, పాలకులు ఎవరు కూడా ఈ బహిరంగ దోపిడిని అరికట్టుటకు ముందుకు రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.