Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హేమంత్ కుమార్ బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కందికట్ల అనిల్‌లు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం అస్సాం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో యువ నాయకుడు రాహుల్ గాంధీకి లభిస్తున్న ఆదరణ చూసి, ఓర్వలేకనే బీజేపీ నాయకులు నీచపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అస్సాం సీఎంను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనుమాముల మార్కెట్ మాజీ డైరెక్టర్ పిన్నింటి సునీల్ రావు, ఎంపీటీసీ బొట్ల మహేంద్ర, కల్లెడ సొసైటీ డైరెక్టర్ జూలపల్లి గంగాధర్ రావు, ఎస్సీ సెల్ కన్వీనర్ నరుకుడు రవీందర్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు లచ్చు నాయక్, కంటేం సుధాకర్, దారం పూర్ణచందర్, బొట్ల వెంకన్న, నర్సయ్య, సతీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-చెన్నారావుపేట
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై అనుచత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హేమంత భీశ్వ శర్మ. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణ త్యాగం చేశారని, అలాంటి కుటుంబం పట్ల అనుచితంగా మాట్లాడిన అస్సాం సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాహుల్ గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ - నర్మెట్ట
ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్ నర్మెట్ట బాధ్యుడు గుండెటీ రాంచందర్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలతో తెలిపారు. సీఎం స్థాయిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని తెలిపారు.