Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీడబ్య్లూసీ మాజీ చైర్పర్సన్ మండల పరశురాములు
నవతెలంగాణ-కాశిబుగ్గ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలు హక్కుగా పొందాలని చైల్డ్ వెల్ఫేర్ కమీటి వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ చైర్ పర్సన్ మండల పరుశరాములు పిలుపునిచ్చారు. ఆదివారం ఉర్సు ప్రతాప్ నగర్ లోని ఎస్సీ కమ్యూనిటీ హల్లో యాక్షన్ ఎయిడ్ అధ్వర్యంలో వరంగల్ జిల్లా సమన్వయకర్త చుంచు రాజేందర్ అద్యక్షతన భూమి ఉపాధి-సంక్షేముంఅభివద్ది, కోవిడ్-19, ఈ శ్రమ్ భీమాపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు అందుబాటులో వైద్య సేవలుండాలన్నారు. బాలకార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నారు. బాల్యవివాహాలు జరగకుండా ప్రజలందరూ కృషి చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివద్ధి నిధి చట్టం నిధులను దారి మళ్ళించకుండా, అట్టి నిధులను దళిత, గిరిజనులకే ఖర్చు చేయాలన్నారు.
శ్రమశక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. కార్మిక శాఖ అందిస్తున్న స్కీంలను ప్రతి కార్మికుడు పొందాలన్నారు. భవన నిర్మాణరంగ కార్మికులు లేబర్ కార్డును, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ శ్రమ్ కార్డును తీసుకోవాలని సూచించారు. అనంతరం పీహెచ్సీ ప్రతినిధి సుధారాణి మాట్లాడుతూ.. కరోనా నివారణ కోసం ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అఖిల భారత పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర ఆద్యక్షులు కేడల ప్రసాద్, ద్రావీడ బహుజన సమీతి వరంగల్ జిల్లా అధ్యక్షుడు పాల రవికుమార్, కార్మిక నాయకులు ఈ రవీందర్, రిటైర్డ్ ఎస్ఐ బొనాల గోపాల్, లెక్చలర్ లింగమూర్తి పాల్గొన్నారు.