Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-జనగామ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రమల సుధాకర్, జగదీశ్వర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, వేముల సత్యనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు...
నవతెలంగాణ-శాయంపేట
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మపై సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఎస్సై ఇమ్మడి వీరభద్రరావుకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు దూదిపాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీపై సభ్య సమాజం తల దించుకునేలా అస్సాం సీఎం మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వెంటనే ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని, భారత ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం రవి, నిమ్మల రమేష్, కుమారస్వామి, వలి హైదర్, రఫీ, మార్కండేయ, దేవయ్య, జగన్, చిరంజీవి, వీరస్వామి పాల్గొన్నారు.
నవతెలంగాణ - చెన్నారావుపేట
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హేమంత్ భీశ్వశర్మపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తోట మహేందర్‌కు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి నర్సయ్య, జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి. మండల ఉపాధ్యక్షులు రమేష్. సర్పంచులు సిద్ధన రమేష్, తోటి పావని రమేష్. యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, హరీష్, పులిశేరు రాజేందర్, మండల కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మల్ల స్వామి పాల్గొన్నారు.
నవతెలంగాణ-కాశిబుగ్గ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమాంత్ భిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని సోమవారం కాంగ్రెస్ నాయకులు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు, దామెర సర్వేశం, గోల్లెన రవి, గిన్నారం రాజు, కొత్తపల్లి శ్రీను, జన్ను రవి, లింగన్న, కూచన రవీందర్, అదాం, వేణు, రాజేష్ సుధాకర్, రాజు, జీవన్, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ధర్మసాగర్
అస్సాం సీఎం అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆయనపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రొండి రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్, జాలిగపు దుర్గయ్య, సారయ్య, వార్డ్ సభ్యులు కొట్టె విజయభాస్కర్, పాక మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఆత్మకూర్
అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మండలాధ్యక్షులు కమలాపురం రమేష్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పోలీసుస్టేషనలో సీఐ గణేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరికరాల వాసు, భయ్యా కుమారస్వామి, రమణ, రవి, తిరుపతి, లోకాటి రాజు, రమేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-దామెర
అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పోలే పాక శ్రీనివాస్, మండల యువత అధ్యక్షులు మన్నెం ప్రకాష్ రెడి, సీనియర్ నాయకుడు పోశయ్య, దుబాసి రాజేందర్, కిరణ్ కుమార్, రాజు, చేరాలు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-బచ్చన్నపేట
అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని సోమవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు కోడూరు మహాత్మాచారి ఆధ్వర్యంలో స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, పుష్ప బాలకిషన్ గౌడ్, అల్వల రాధ ఎల్లయ్య, జిల్లెల్ల సిద్ధారెడ్డి, మహిళా అధ్యక్షురాలు బొమ్మేర్ల వేణు, వందన, నాయకులు గౌస్, వేముల నర్సింలు, దాచేపల్లి రాజయ్య పాల్గొన్నారు.
నవతెలంగాణ-పర్వతగిరి
రాహూల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలిస్ స్టేషన్లో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ సోమవారం ఎస్సై కెే కిషోర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బొట్ల మహేంద్ర, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల అనిల్, మహిళా కాంగ్రెస్ మండలాధ్యక్షురాలు మాసాని సువర్ణ, బీసీ సెల్ మండల అధ్యక్షులు లచ్చు నాయక్, పట్టణ అధ్యక్షులు కూసం రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నల్లబెల్లి
అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని సోమవారం కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, నరకపేట గ్రామ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, మాజీ ఎంపీటీసీ రామ్మూర్తి, గ్రామ పార్టీ యూత్ అధ్యక్షుడు నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఖానాపురం
అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు వేములపల్లి వెంకటప్రసాద్ రావు, జిల్లా నాయకులు శాఖమూరి హరిబాబు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వీరమనేని సాగర్ రావు, నాయకులు శాఖమూరి ముఖేష్ చౌదరి, కాసుబడ సాంబయ్య లతో పాటు పలువురు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పరకాల
అస్సాం సీఎం హిమంత్ భిశ్వ శర్మను సీఎం పదవి నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ నలుబాల కిష్టయ్య అన్నారు. సోమవారం పరకాల పోలీసులకు రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, నాయకులు బొచ్చు చందర్, బుర్ర దేవేందర్, రఘునారాయణ, చంద్రమౌళి, రాజేష్, విజరు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొడకండ్ల
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని సోమవారం కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక పీఎస్‌లో ఏఎస్ఐ సీతారాములకు పిటిషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరసయ్య ఎస్టీసెల్ మండలాధ్యక్షుడు ధర్మారం బిక్షపతి, డైరెక్టర్ శ్రీనివాస్, అయితరాజు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పాలకుర్తి
అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై చర్యలు తీసుకోవాలని సోమవారం కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, అడ్డూరి రవీందర్ రావు, అనుముల మల్లారెడ్డి, భాస్కర్, సురేష్, హరిలాల్, చంద్రయ్య, శ్రీను, యాక సోమయ్య పాల్గొన్నారు.
నవతెలంగాణ-హసన్‌పర్తి
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత వాఖ్యలపై హసన్‌పర్తి పోలీసు స్టేషన్లో వర్దన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి నమిండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, హన్మకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తంగళ్లపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్ గంట సంజీవరెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గం కో-ఆర్డినేటర్ మార్క విజరు, టీపీసీసీ అధికార ప్రతినిధి కుచన రవళి రెడ్డి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బల్సుకూరి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు అజ్మీరా రమేష్ తదితరులు పాల్గొన్నారు.