Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ విలీన గ్రామాలను అభివృద్ధి పథంలో నిలపాలానే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. 65వ డివిజన్ పరిధిలో మొత్తం రూ.8 కోట్ల అభివృద్ది పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విలీన గ్రామాల అభివద్ధికి ప్రతీ నిత్యం కషి చేస్తున్నానని అన్నారు. గ్రామాలలోని ప్రతీ వాడకు సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హల్లు, స్మశాన వాటికలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. విలీన గ్రామాలలో పట్టణ వాతావరణం తీసుకువచ్చేందుకు కషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుగులోతు దివ్యరాణిరాజునాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఏరుకొండ శ్రీనివాస్, పంజాల భూపాల్గౌడ్, చుంచు రవీందర్, సూర కర్ణాకర్రెడ్డి, నద్దునూరి నాగరాజు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.