Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిగ్రీ కళాశాల మంజూరుకు ప్రకటన
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ, టీజీఎస్ చేసిన పోరాట ఫలితంగానే డిగ్రీ కళాశాల మంజూరుకు సీఎం కేసీఆర్ ప్రకటించారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దడిగే సందీప్ కుమార్, టీజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లావుడియా అనిల్ చౌహాన్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, టీజీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు. 2018ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ, టీజీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేశామన్నారు. జనగామలో జరిగిన బహిరంగ సభలో సీఎం డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నామని ప్రకటించారని తెలిపారు. సీఎం హామీని అమలు చేసేందుకు వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సందీప్, పూజ, మాధవి, కవిత, తదితరులు పాల్గొన్నారు.