Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిశీలించిన తహసీల్దార్ ఎంపీడీఓ
మధ్యాహ్న భోజన నిర్వాహకుల తొలగింపునకు ఆదేశం
నవతెలంగాణ-శాయంపేట
మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకులు రుచి, పచి లేకుండా ఇష్టారాజ్యంగా వండి పెడుతుండడంతో భోజనం తినలేక పోతున్నామనీ, ఈ భోజనం తమకొద్దు అంటూ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించారు. ఈ ఘటన మండలంలోని పెద్దకొడపాక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పెద్దకొడపాక ప్రభుత్వం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో కడవెండి పద్మ, అన్న వసంతలు 12ఏండ్ల నుంచి మధ్యాహ్న భోజనాన్ని వండి పెడుతున్నారు. భోజనం సరిగా వండడం లేదని విద్యార్థులు తినలేక పోతున్నారని, వారి తల్లిదండ్రులు స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాష్ రెడ్డి దష్టికి తీసుకువచ్చారు. గతంలో పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డీఈఓ దష్టికి ఎస్ఎంసి చైర్మన్, సర్పంచ్ మధ్యాహ్నం భోజనం విషయాన్ని తీసుకెళ్లారు. మండల సభలో మధ్యాహ్న భోజన నిర్వాహకులను మార్చాలని సర్పంచ్ చర్చ లేవనెత్తారు. అయినప్పటికీ నిర్వాహకులను మార్చలేదు.
సోమవారం మధ్యాహ్న భోజనాన్ని 194 మంది హై స్కూల్ విద్యార్థులు, 92 మంది పీిఎస్ విద్యార్థులు బహిష్కరించారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనురాధ, శశికళ సర్పంచ్ దష్టికి తీసుకురావడంతో స్పందించిన సర్పంచ్ ప్రకాష్ రెడ్డి ఎంపీడీఓ ఆమంచ కష్ణమూర్తి, తహసిల్దార్ హరికష్ణ దష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన వారు పాఠశాలకు చేరుకొని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం బాగా లేదని స్పష్టం చేశారు. ఎస్ఎంసి కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల అభిప్రాయ సేకరణ చేపట్టి మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగిస్తున్నట్లు తీర్మానం చేశారు. నాణ్యతతో భోజనం అందించే నిర్వాహకులను ఏర్పాటు చేసుకోవాలని, వారం రోజుల పాటు భోజనం నిర్వహణ సరిగా ఉంటే నిర్వాహకులుగా ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులను మార్చడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ ప్రకాష్ రెడ్డి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.