Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని గౌడ జన హక్కుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారుపోతుల సాయి కిరణ్ గౌడ్ తెలిపారు. సోమవారం స్థానిక సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహం వద్ద ఉద్యోగుల సంఘం జిల్లా క్యాలెండర్‌ను ఆ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూల వెంకటేశ్వర్లు గౌడ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ సామాజిక వర్గంలో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సమాయత్తం కావాలని, రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మూల మహేందర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి నాయకులు వెంకన్న, ఉప్పలయ్య, పరమేశ్వర్, దామోదర్, సోమ నారాయణ, రమేష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.