Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ బీ గోపి
నవతెలంగాణ - వర్ధన్నపేట
నూతనంగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కషిచేయాలని వరంగల్ కలెక్టర్ గోపి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన 2022-2023సంవత్సరం మున్సిపల్ అంచనా బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆదాయ వ్యయాలపై సమీక్షించారు. 2022-2023 సంవత్సరం యొక్క అంచనా బడ్జెట్ కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ జూనియర్ అకౌంట్ అధికారి రజిని ఆదాయ-వ్యయాలను శాఖల వారిగా వివరరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 167 ప్రకారం స్థానిక సంస్థల ఆదాయ వ్యయాలు, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసుకోనీ స్వయం వనరుల సమీకరణ ప్రయత్నాల చేసుకుంటూ బలోపేతం అయ్యే మార్గాలు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని సూచించారు. క్వాలిటీలోని అన్ని ప్రాంతాలూ సమాన అభివద్ధి లక్ష్యంగా కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన ఉండాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు ఒక ప్రణాళికాబద్ధంగా అభివద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణ ప్రగతి నిధులు అందుతాయని తెలిపారు. శానిటేషన్, వాటర్ చార్జీలు, లోన్ పేమెంట్, కరెంటు చార్జీలతో పాటు 10శాతం గ్రీన్ బడ్జెట్ నిధులను ఖర్చుగా చూపాలని నిర్దేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలల్లో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్లో సమర్థవంతంగా రూపొందించేందుకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సమావేశములో అదనపు కలెక్టర్ హరిసింగ్ నాయక్, కమిషనర్ గొడిశాల రవీందర్, వైస్ చైర్మన్ కొమాండ్ల ఎలెందర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.