Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- హన్మకొండ
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినరు భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. 17న సీఎం జన్మదినం సందర్భంగా 15, 16, 17వ తేదీల్లో నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా 15న హంటర్ రోడ్లోని వద్ధాశ్రమంలో దుస్తులు, బ్లాంకెట్స్ పంపిణీ, 16న ఆర్స్స్ అండ్ సైన్స్ కళాశాలలో రక్తదాన శిబిర, 17న సీఎం జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, పోడిషెట్టి అనిల్, జూకంటి లక్ష్మణ్ పాల్గొన్నారు.