Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
సీఎం కేసీఆర్ విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారని సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య అన్నారు. గట్లకానీపర్తి ప్రభుత్వ పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణానికి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి సహకారంతో విడుదలైన 12 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల పనులను సోమవారం సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గండ్ర దంపతుల సహకారంతో గ్రామంలో మరిన్ని అభివద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని, ఇక్కడే క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆమంచ కష్ణమూర్తి, ఎంపీటీసీ బత్తిని రజనీ సత్యనారాయణ, ఉపసర్పంచ్ సురేష్, పంచా యతీ కార్యదర్శి నాగ శ్రీ, విద్యా కమిటీ చైర్మన్ రాజేష్, వార్డు సభ్యులు బొమ్మకంటి ఆనందం, రమేష్, నాయకులు సురేష్, సంపత్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.