Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ అన్నారు. సోమవారం పశువుల సంత మైదానంలో ఏర్పాటు చేసిన బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసును ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షిత మన్నారు. అంతేకాకుండా అమ్మవార్ల గద్దెల వద్దకు బస్సులు వెళ్తాయని అన్నారు. కమిషనర్ శేషు, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, డీఎం పవన్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనులను చైర్మన్ పరిశీలించారు.