Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
మేడారం జాతర సందర్శకులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. సోమవారం ఆర్టీసీ బస్‌స్టేషన్ వద్ద మేడారం జాతర ప్రత్యేక బస్‌ల టికెట్ కౌంటర్ వద్ద టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి సౌజన్యంతో సందర్శకులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. కరోనా పరిస్థితులు తిరిగి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు భౌతిక దూరం, మాస్కులను ధరించడం వంటి ముందస్తూ జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఇందుకోసం మరో సారి ఆలోచింపజేయడం కోసం ఈ మాస్కులను పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం అభినందనీ యమన్నారు. కౌంటర్ వద్ద టికెట్‌తో పాటు మాస్కులను అందజేయాలని డిపో మేనేజర్ శ్రీనివాసరావుకు సూచించారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ నల్లా మనోహర్ రెడ్డి, హైర్ బస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు నాగిశెట్టి ప్రసాద్, బండి రమేష్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్దల శ్రీధరెడ్డి, ఉపాధ్యక్షులు పెండ్యాల యాదగిరి, ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్, టీఆర్ఎస్కేవీ గోనె యువరాజు, వార్డు కౌన్సిలర్లు రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి, వేల్పుగొండ పద్మరాజు, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి పాల్గొన్నారు.