Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరకాల
విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మంద శ్రీకాంత్ అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని ఎస్.వి జూనియర్ కళాశాలలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్ఎంహెచ్ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు సొంత భవనం లేక పోవడంతో అద్దె భవనాల్లో ఉంటూ సరైన సౌకర్యాలు లేక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులకు త్రాగునీరు లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్లు పని చేయడం లేదన్నారు. దీంతో విద్యార్థులు కంప్యూటర్ విద్యకు దూరమవు తున్నారన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను దష్టిలో పెట్టుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొచ్చు కళ్యాణ్, మడికొండ ప్రశాంత్, ఎండీ అక్రమ్, సుమన్, పవన్, అఖిల్, శివ, రాజ్ కుమార్, ప్రవీణ్ వినరు, శివ తదితరులు పాల్గొన్నారు.