Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-బచ్చన్నపేట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందుత్వ ఎజెండాతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం కాకుండా, ప్రజా సమస్యలపై దష్టి పెట్టాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో కళ్లెం శైలజ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలతో అన్ని వర్గాల వారు తీవ్ర ఆర్థిక దోపిడికి గురవుతున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్మేస్తుందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామిక విలువలు కుంటుపడ్డాయని, నిరుద్యోగ సమస్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని వాపోయారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి ప్రజల జీవన మనుగడ కష్టదాయకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా.. ప్రజల మధ్య.. కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజా ఉద్యమాలు నిర్వహించకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గొల్లపల్లి బాపురెడ్డి, మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, మండల కమిటీ సభ్యులు మినాలపురం ఎల్లయ్య, రావుల రవీందర్ రెడ్డి, పరుశరాములు, బలరాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అంబటి సత్తెన్న ఆశయసాధన కోసం
ఉద్యమాలు చేపడదాం..
నవతెలంగాణ-జనగామ
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కామ్రేడ్ అంబటి సత్యనారాయణ ఆశయ సాధన కోసం జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపడతామని ఆ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలోకామ్రేడ్ అంబటి సత్యనారాయణ ప్రధమ వర్ధంతి సభను సోమవారం ఏదునూరి వెంకట్రాజం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామ్రేడ్ అంబటి సత్యనారాయణ తను మరణించేంతవరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశారన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు కామ్రేడ్ సత్తన్న ఆశయ సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి ఆహాల్య, సీనియర్ నాయకులు బోట్ల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గొపి, పీ ఉపేందర్, ఎన్నపూస కుమార్ పాల్గొన్నారు.