Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ రహదారిపై ఉద్యమకారుడి అర్ధనగ నిరసన..
నవతెలంగాణ-ఆత్మకూర్
తెలంగాణ ఉద్యమకారులను మరిచి తన భజన పరులకే ఎమ్మెల్యే దళిత బంధు పథకం ఇస్తున్నారని సోమవారం మండల కేంద్రంలోని 163వ జాతీయ రహదారిపై తెలంగాణ ఉద్యమకారుడు నాగేల్లి స్వామీ(టీఆర్ఎస్ స్వామి) అర్ధనగ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20ఏండ్ల పాటు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కార్యకర్తలను మరిచి తన భజనపరులకు దళితబంధు ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వంలో తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను మరచిన ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు.