Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
దళిత బందు పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని సోమవారం దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారని ఆరోపించారు. గ్రామంలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బందు ఇవ్వాలన్నారు. ఒకవేళ అన్ని కుటుంబాలకు దళిత బందు ఇవ్వలేని పక్షంలో గతంలో ప్రభుత్వం ద్వారా ఎటువంటి లబ్ధి పొందని వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దళిత బంధు లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మెట్టిపల్లీ ఏలీయా, సీఐటీయూ నాయకుడు దుపాకి రాజు, గుండేటి రాజేష్, ఏం రాజు, ఎం అనిల్, జీ ప్రశాంత్, ఎన్శంకర్, జీ స్వామి, జీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.