Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం మన ఊరు-మన బడి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు మాట్లాడారు. మొదటి దశలో మన జిల్లాలో 35శాతం పాఠశాలలు మాత్రమే ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 176 పాఠశాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. గుర్తించిన పాఠశాలలను ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, పీఆర్, మహానగర పాలక సంస్థ, ఇంజనీర్లు, హెచ్ఎంలు సందర్శించాలన్నారు. పాఠశాలలో పెండింగ్ పనులు, ప్రహరీ గోడలు, కిచెన్ షేడ్లు, మరుగు దొడ్లు, వాల్ పెయింటింగ్స్ తదితర పనులు గుర్తించాలన్నారు. వాటిని స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులతో సమావేశంలో నిర్వహించి పనులను ఎస్ఎంసీ ద్వారా నిబంధనల ప్రకారం వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, డీఆర్డ్డీఓ శ్రీనివాస్ కుమార్, ఆర్డీఓ వాసు చంద్ర, డీఈఓ, విద్యా శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.