Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
నవతెలంగాణ-భూపాలపల్లి
సీఎం కేసీఆర్ బరాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఇది సరైంది కాదని కాంగ్రెస్ జయశంకర్-భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మహాజన సోషలిస్టు ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కేసీఆర్‌కు సీఎం పదవి కూడా రాజ్యాంగబద్దంగా వచ్చిందని అన్నారు. దళిత బంధు పేరిట దళితులను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకొచ్చాక సింగరేణి ఓపెన్ కాస్ట్లను రద్దు చేస్తామని భూగర్భగనుల ద్వారానే బొగ్గు ఉత్పత్తి చేస్తామని చెప్పి సింగరేణి కార్మికులను మోసం చేశారని మండిపడ్డారు. సింగరేణి సంస్థలో 4 బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరిస్తున్నా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. టీిఆర్‌ఎస్, బీజేపీలు దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. పోలీసులు అధికార పార్టీకి ప్రతినిధిలుగా మారారని, అవినీతిని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఘం చెబుతారని హెచ్చరించారు. సింగరేణి సేవ్ నిధులు ఇతర ప్రాంతాలకు మంత్రులు వారి నియోజకవర్గాల అభివృద్ధికి మళ్లిస్తుంటే స్థానిక ప్రజా ప్రతినిధిలు చోద్యం చేస్తున్నారని అన్నారు. సింగరేణి సేవ్ నిధులు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధికి ఖర్చు చేయాలని కోరారు. సింగరేణి ఆస్పత్రిలో, పూర్తైన 100 పడకల ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలని, ఖాళీ వైద్య పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దూడపాక శంకర్, నాయకులు అంబాల శ్రీనివాస్, తోట సంతోష్,పిప్పాల రాజేందర్, రంజిత్, సురేష్, ప్రసాద్, ఏఐఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎమ్మార్పీఎస్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.