Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్బెల్ట్
సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ కోరారు. మంగళవారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1, 6 గనుల మేనేజర్లకు వినతిపత్రాలు అందజేసి వారు మాట్లాడారు. నాలుగు కోల్ బ్లాకులు రాకపోతే కార్మికుల భవిష్యత్ అంధకారమయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. ఉన్న ఉపరితల, అండర్ గ్రౌండ్ బావుల్లో కాంట్రాక్టు కార్మికులతో పని చేయిస్తున్నారని అన్నారు. టీబీజీకేఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని మండిపడ్డారు. బొగ్గు బ్లాకులను కేంద్రం ఇచ్చే పరిస్థితిలో లేదని, రాష్ట్రప్రభుత్వం కూడా తెచ్చే పరిస్థితిలో లేదని విమర్శించారు. క్లర్కులు, పారా మెడికల్ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. మైనింగ్,ట్రేడ్స్ మెన్, ఈపీ ఆపరేటర్ల సమస్య, నూతన బొగ్గుబావులు, క్యాంటీన్లను సింగరేణి యాజమాన్యం నడిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ సమ్మె చేయాల్సి వస్తదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాస్, నూకల చంద్రమౌళి, రాజ్ మొహ్మద్ ,బీమా, మాటేటి శ్రీనివాస్, శ్రీనివాస్, హైమద్, గణేష్, సత్యనారాయణ, సిద్దయ్య, శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.