Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
సొసైటీలో అక్రమాలకు పాల్పడిన దోషులపై చర్యలు తీసుకోవాలని సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొండయ్య, వొన్న తిరుపతిరావు, సమ్మక్క కోరారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ఫిిర్యాదు చేసి వారు మాట్లాడారు. మండల కేంద్రమైన తాడిచెర్ల పీఏసీఎస్‌లో దాదాపు రూ.కోటి వరకు లూటీ అయినట్లు వచ్చిన ఆరోపణలపై కమిషనర్‌తోపాటు భూపాలపల్లి డీసీఓ ప్రత్యేక అధికారిని నియమించి ఆరు నెలల పాటు విచారణ చేపట్టి నివేదిక తయారు చేసినట్లు తెలిపారు. 15 రోజుల కిందట పీఏసీఎస్, డీసీఓ, అధికారులు సర్వసభ్య సమావేశం నిర్వహించి అక్రమాలపై 17 పేజిల నివేదికను రూపొందించారన్నారు. రూ.75 లక్షల వరకు అక్రమాలు తేలినట్లుగా తేటతెల్ల మైందన్నారు. చైర్మన్, మాజీ సీిఈఓ, మాజీ ఆపరేటర్, ప్రస్తుత ఎరువుల సేల్స్ మెన్, అధికారపార్టీకి చెందిన సింగిల్ విండో డైరెక్టర్ దోషులుగా తేలినా చర్యలు తీసుకోలేదని అన్నారు. విచారణ చేపట్టిన ప్రత్యేక అధికారి, పిఏసీఎస్ సీఈఓ నివేదికకు సంబంధించిన ఉన్నతాధికారులకు సమర్పించడంలో జాప్యం చేస్తున్నారని వివరించారు. వెంటనే చర్యలు చేపట్టేందుకు డీసీఓకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు డైరెక్టర్లు తెలిపారు.