Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మహాముత్తారం
కాటారం-మేడారం ప్రధాన రహదారి పెగడపల్లి వద్ద రూ.2కోట్లతో. పూర్తి చేసిన బీటీరోడ్డును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెగడపల్లి గ్రామస్తులు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని రోడ్డుపై ధర్నాలు, తనకు ఫిర్యాదు చేసారని గుర్తు చేశారు. వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో దుమ్ముతో గ్రామస్తులు అనారోగ్యానికి గురౌతున్నారన్న వారి విజ్ఞప్తి మేరకు డీఎంఎఫ్డీ నిధులు రూ.2కోట్లు మంజూరు చేసి రోడ్డు నిర్మించామన్నారు. అనంతరం తహసీల్ధార్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది వివరాలు, ప్రభుత్వ భూమి, తదితర సమస్యలు తహసిల్దార్ మాధవిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని మహముత్తారం, జీలపల్లి, స్తంభంపల్లి పీకే, పెగడపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణంలో జాప్యంపై ఆరా తీశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 20లక్షలు సిద్ధంగా ఉన్నాయని, మార్చి లోపు పనులు పూర్తి చేయకుంటే నిధులు వెనక్కి పోతాయన్నారు. 'మన ఊరు మనబడి' కింద పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దళితబందు పథకంపై అర్హులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కోనంపేట, రాంపూర్ రహదాని పరిశీలించారు. నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేపిస్తామన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ లింగమల్ల శారద, దహసీల్ధార్ మాధవి, ఎంపీడీఓ రవీంద్రనాథ్, తదితరులు ఉన్నారు.