Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
అక్రమ ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని సీజ్ చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణ ప్రసాద్ మంగళవారం తెలిపారు. మండలంలోని కాల్వపల్లి మానేరు వాగు నుండి ఎలాంటి అనుమతిపత్రాలు లేకుండా అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. తనిఖీ చేసి ట్రాక్టర్లను పట్టుకుని అందుకుతండ నేరేడుపల్లి గ్రామాలకు చెందిన భూక్య రాజు, బాణాల రమేష్, సుంకరి ప్రశాంత్ రెడ్డి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.