Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధుపథకం అర్హులైన దళితులందరికీ వర్తింపజేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17లక్షల మంది దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి వందమంది దళితులను గ్రామ సభ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోందని, అవినీతి అక్రమాలకు తావులేకుండా గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో అర్హులను ఎంపిక చేయాలన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించివ్వాలని కోరారు. జనగామ జిల్లాలో గిరిజనులు అధికంగా ఉన్నారని, వారికి గిరిజనబంధు అమలు చేయాలన్నారు. ఇతర కులాల వారికి కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టే 2022 -23 బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా చూడాలని అన్నారు. లేదంటే ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, సింగారపు రమేష్, రాపర్తి సోమయ్య, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న, ఏరియా కమిటీ నాయకులు మాచర్ల సారయ్య, ప్రజా సంఘాల నాయకులు కె రమేష్, బి వెంకన్న, కే సోమయ్య,. యాదగిరి, కొండయ్య, ఐలయ్య, విజరు, బాబు తదితరులు పాల్గొన్నారు.