Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యువజన కాంగ్రెస్ రాష్ట్ర నేత కీసర దిలీప్‌రెడ్డి
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే, అధికారంలోకొచ్చిన సీఎం కేసీఆర్ రాష్ట్రప్రజల సంక్షేమాన్ని విస్మరించి, ప్రజల్ని మభ్యపెడుతూ నియంతలా వ్యవహరిస్తున్నాడని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్‌రెడ్డి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు బస్వగాని అనిల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆపార్టీ చేస్తున్న సంబరాలకునిదర్శనమని తెలంగాణ నిరుద్యోగ దినమని, చీకటిదినంగా ప్రకటిస్తూ అమరవీరుల స్థూపం వద్ద చిత్రపటానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నీళ్లు, నియామకాలు, ఉద్యోగాల నినాదంతో రాష్ట్రం సాధిస్తే సీఎం కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులపాటు నిర్వహించాలనడం సిగ్గుచేటన్నారు. ఈ మూడు రోజులు యువజన కాంగ్రెస్ ఆద్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, ఐలపాక శ్రీనివాస్, మారపాక వసంత్, ఎడ్ల భాస్కర్, రాజశేఖర్, సంపత్, పత్యూష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.