Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నెల్లుట్ల గ్రామంలో సీఎం కేసీఆర్ జన్మదిన కార్యక్రమంలో భాగంగా టీిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేంకు సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, యూత్ మండల అధ్యక్షుడు శ్రీవారి, గంగధర్, తదితరులు పాల్గొన్నారు.