Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాలకుర్తి అభివద్ధిపై సీఎం దృష్టి
అ దళితబంధు అమలుకు రూ.20 వేల కోట్లు
అ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 70 ఏండ్ల పరాయి పాలనలో తెలంగాణ అబివృద్ధికి నోచుకో లేదని తెలిపారు. ఏడేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ పల్లెలు అభివృద్ధి చెందాయని, సాగునీటితో సస్యశ్యా మలంగా మారాయని తెలిపారు. అభివద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని అన్నారు. పల్లె ప్రగతితో పల్లెలను అభివృద్ధి చేశామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఇటీవల జనగామలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల, జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల మంజూరుకు ప్రకటన చేశారన్నారు. పాలకుర్తి, తొర్రూర్ ప్రభుత్వ ఆస్పత్రులను వంద పడకల ఆస్పత్రిగా, కొడకండ్ల, దేవరుప్పుల, రాయపర్తి ప్రభుత్వ ఆస్ప త్రులను 30 పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. పెద్దవంగర మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దళితబంధు పథకం అమలు కోసం బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. టూరిజం ప్యాకేజీలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు పాలకుర్తి, బొమ్మెర, వల్మిడిలకు నిధులు మంజూరు చేశామని, మరో రూ.15 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు. రాయపర్తి మండలం సన్నూర్ ఆలయ భూములను సాగు చేసుకునే రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.10కోట్లు మంజూరు చేశా మన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రైతులకు 24 గంటల విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రైతులకు పెట్టుబడిసాయం అందించడంలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. పాలకుర్తి చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అన్నారు. రోడ్ల విస్తరణ అనంతరం సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పాలకుర్తి రూపురేఖలు మారుతాయని తెలిపారు. పాలకుర్తి చౌరస్తాలో రోడ్డు విస్తరణ పనుల పై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో జీవనోపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
తెలంగాణ గాంధీ కేసీఆర్
ఆంధ్రుల కబంధహస్తాల నుండి తెలంగాణ సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణ గాంధీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే జన్మదిన వేడుకల సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఈనెల 17న ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, రైతు వేదికల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలన్నారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మెన్ ముస్కు రాంబాబు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండీ మదర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు, వైద్యాధికారిని గడెం యామిని, డాక్టర్ రవి రాథోడ్, మాజీ ఎంపీపీ దళ్జిత్ కౌర్, ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తరాల చంద్రబాబు, టీిఆర్‌ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు నోముల సతీష్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, మండల కోఆప్షన్ సర్వర్ ఖాన్, మాజీ కో-ఆప్షన్ అబ్బాస్ అలీ, మాజీ వైస్‌ఎంపీపీ దామోదర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.